వరంగల్ లో ఆర్టీసీ బస్సుకు తప్పిన ప్రమాదం
వరంగల్ లో డ్రైవర్ అప్రమత్తతతో ఆర్టీసీ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. వేముల వాడ నుంచి వరంగల్ వస్తున్న ఆర్టీసీ ఎక్స్ ప్రెస్ బస్సు హన్మకొండ వద్దకు రాగానే, బస్సు వెనుక భాగంలో ఉన్న వైర్లు షార్ట్ సర్క్యూట్ అయ్యాయి. దాంతో, బస్సులో మంటలు లేచి దట్టమైన పొగలు వ్యాపించాయి. ఇది గమనించిన బస్సు డ్రైవర్ మంటలను అదుపు చేయడంతో ప్రయాణీకులు ఊపిరి పీల్చుకున్నారు.